అమలాపాల్ బాటలో నగ్నంగా ఆండ్రియా!
నటీమణులు కథ ప్రకారం ఏవిధమైన పాత్రను పోషించడానికి సిద్ధమనే అంటున్నారు. హాలీవుడ్ తరహాలోనూ నటించేందకు సిద్ధమవుతున్నారు. తమిళ సినిమా ఆడై కోసం అమలాపాల్ నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే.
ఎటువంటి అచ్చాదనం లేకుండా నగ్నంగా నటిస్తూనే కనపడకుండా ఓ అద్దాన్ని అడ్డుగా పెట్టుకుంది. ఇక అదేతరహాలో ఆండ్రియా నటించిందని తెలుస్తోంది. గతంలో మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన `పిశాసు` చిత్రం వచ్చింది. సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తయారవుతోంది. ఈ ఏడాది జనవరిలో షూట్ ప్రారంభమైంది. కొంత భాగం చేశాక కోవిడ్ వల్ల వాయిదా పడింది. తాజాగా షెడ్యూల్‌ను ప్రాంభించారు.
మిష్కిన్ దర్శకత్వంలో పిశాసు-2 సినిమాలో ఆండ్రియా నటిస్తోంది. పూర్ణ, రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలను పోషిస్తుండగా విజయ్ సేతుపతి మాంత్రీకుడి గెటప్‌లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో ఆండ్రియా నగ్నంగా నటించినట్లు తెలుస్తోంది. కథ డిమాండ్ చేయడంతో ఒకానొక సందర్భంలో ఆమె నగ్నంగా నటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ మీడియా కథనం ప్రకారం ఆమెపై చిత్రించిన సీన్‌ను నైట్ ఎఫెక్ట్‌లో మసకమసకగా కనిపించే విధంగా కెమెరామెన్, దర్శకుడు మాత్రమే ఆ సన్నివేశాన్ని చిత్రించినట్లు తెలుస్తోంది. త్వరలో విడుదలకానున్న ఈ సినిమా చూస్తేనేగానీ ఆమె ఎంతమేరకు నటించిందో తెలియనుంది.