బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 30 అక్టోబరు 2019 (19:08 IST)

అటు ఇటు కాకుండా అయిపోయిన అనుపమా పరమేశ్వరన్, ఏమైంది?

సినిమాల్లో నటించడం బోర్ కొట్టేసిందేమో అనుపమకు.. ఇప్పుడు ఏకంగా సహాయ దర్సకురాలి అవతారమెత్తింది. కెమెరా వెనుక సీన్లను చెబుతూ తెగ ఎంజాయ్ చేసేస్తోంది. ఒక మలయాళ చిత్రానికి సహాయ దర్సకురాలిగా ప్రస్తుతం పనిచేస్తోంది అనుపమ పరమేశ్వరన్.
 
ఇక సినిమాలంటారా.. ప్రస్తుతానికి చేతిలో సినిమాలు లేకపోవడంతో సహాయ దర్సకురాలి పాత్రే బాగుంటుందంటోంది ఈ మలయాళ కుట్టి. చదువు ప్రారంభంలోనే సినిమా అవకాశాలు వస్తే చదువును మధ్యలో వదిలేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించింది. 
 
అయితే తనకు తెర ముందు నటించడం, తెర వెనుక నుంచి సినిమాలకు పనిచేయడం అన్నా రెండూ ఇష్టమంటోంది అనుపమ. తన గురించి మలయాళ పరిశ్రమలో ఒక ప్రచారం జరుగుతోంది. అనుపమ ఇక సినిమాల్లో నటించదు. తెర వెనుకే ఉండిపోతుందని.. అయితే అందులో నిజం లేదు. నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. 
 
ఖాళీ సమయాల్లో ఇలా సహాయ దర్సకురాలిగా పనిచేస్తూ ఉంటానని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. కానీ పాపం అనుపమా పరమేశ్వరన్ అటు సినిమాల్లోనూ ఇటు చదవులోనూ రాణించకుండా పోయిందని ఆమె అభిమానుల్లో కొందరు బాధపడిపోతున్నారు.