బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:37 IST)

''అర్జున్ రెడ్డి''ని అడ్వాన్స్‌గా బుక్ చేస్తున్న దర్శకనిర్మాతలు..

''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అర్జున్ రెడ్డితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తు

''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అర్జున్ రెడ్డితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేసే పనిలో విజయ్ దేవరకొండ వున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విజయ్ దేవరకొండతో జూన్ తర్వాత ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అర్జున్ రెడ్డికి రెండున్నర కోట్ల మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మికను తీసుకోవాలని యూనిట్ సభ్యులు నిర్ణయించారట. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ చేస్తున్న సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. అదే జోడీ మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలోనూ కనిపించనుందని సినీ పండితులు అంటున్నారు.