ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (12:53 IST)

అర్జున్ రెడ్డి క్రేజ్ అదుర్స్: ఆ సీన్స్ కట్ చేసినా టీఆర్పీ రేటింగ్ అప్

అర్జున్ రెడ్డి సినిమా హవా ఇంకా కొనసాగుతూనే వుంది. హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తద్వారా పలు ఆఫర్లు కూడా కైవసం చేసుకున్నాడు. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీ బి

అర్జున్ రెడ్డి సినిమా హవా ఇంకా కొనసాగుతూనే వుంది. హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తద్వారా పలు ఆఫర్లు కూడా కైవసం చేసుకున్నాడు. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా వున్నాడు. అదే విధంగా ఈ సినిమా హీరోయిన్ షాలిని పాండే కూడా తమిళ, తెలుగు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. 
 
తాజాగా అర్జున్ రెడ్డి సినిమా టీవీల్లో ప్రసారం అయ్యింది. భారీ అంచనాల మధ్య ప్రసారమైన ఈ సినిమా అదే స్థాయిలో జనాలను టీవీలకు కట్టిపడేసింది. గతవారం ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమైన ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. 
 
మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమాకు 13.6 టీఆర్పీ రేటింగ్ లభించింది. బాహుబలి తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాగా అర్జున్ రెడ్డి రికార్డ్ సృష్టించింది. థియేటర్లో ప్రసారమైన సన్నివేశాలను టీవీల్లో కట్ చేశారు. సెన్సార్ సీన్లు కట్ చేసినా టాప్ రేటింగ్‌ను అర్జున్ రెడ్డి సంపాదించుకున్నాడు.