గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (22:01 IST)

త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న ఐశ్వర్య అర్జున్

Aishwarya Arjun
ప్రముఖ హీరో, అర్జున్ సర్జా కుమార్తె- ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య అర్జున్ పెళ్లి జరగబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
 
అవార్డు గెలుచుకున్న తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి కూడా నటుడే. ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్య ప్రేమలో వున్నారని టాక్ వస్తోంది. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను అర్జున్ సర్జా ఫ్యామిలీ ఇంకా ధ్రువీకరించలేదు.