మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (20:53 IST)

బాలయ్య నిర్ణయంతో షాక్ అవుతున్న అభిమానులు, ఇంతకీ ఏంటది..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ భారీ చిత్రాన్ని జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కలిసి సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందించారు. 

ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
బాలయ్యను ఎలా చూపించాలో ఆయన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో..? బాలయ్యతో ఎలాంటి సినిమా తీస్తే... సక్సెస్ అవుతుందో బోయపాటికి బాగా తెలుసు. అందుకనే బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో మూవీ అనగానే ఓరేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి.
 
అయితే.. ప్రేక్షకాభిమానుల్లో ఏర్పడిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. అంతకుమించి అనేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు.
 
 ఇటీవలే ఆర్.ఎఫ్.సీలో షూటింగ్ చేశారు. నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కావాలి కానీ.. ప్రస్తుత పరిస్థులు కారణంగా వాయిదా పడింది. ఇందులో బాలయ్య సరసన అంజలి.. శ్రియా కథానాయికలు నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. అఫిషియల్‌గా ఇంకా ఎనౌన్స్ చేయలేదు.
 
 
ఇదిలా ఉంటే... బాలయ్య తదుపరి చిత్రం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. విషయం ఏంటంటే... నెక్ట్స్ మూవీని కూడా ఫైనల్ అయినట్టు గత కొన్ని రోజులుగా ప్రచారమవుతోంది. బాలయ్యతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు.. ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన బి.గోపాల్ దర్శకత్వంతో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. అయితే... సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తుంటే... బాలయ్య మాత్రం అవుట్‌డేట్డ్ డైరెక్టర్‌తో సినిమా చేయడం ఏంటి అనే చర్చ జరుగుతుంది.
 
బాలయ్య అభిమానులు సైతం షాక్ అవుతున్నారట. బి. గోపాల్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడంతో పాటు... ఏకంగా ఈ సినిమాకి ముహూర్తం కూడా ఖరారు చేశారని... జూన్ 10న తన పుట్టిన రోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాని ప్రారంభించాలి అనుకుంటున్నారని సమాచారం. మరి.. ఈ సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ బాలయ్యతో సినిమా తీసి ప్రేక్షకులను మెప్పిస్తారా..? మరో హిట్ అందిస్తారా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.