'బిగ్ బాస్' దివికి బంపర్ ఛాన్స్ : పవన్ సినిమాలో ఛాన్స్! (video)
బిగ్ బాస్ దివికి బంపర్ ఛాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న కొత్త చిత్రంలో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు సమాచారం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం దివిని సంప్రదించినట్టు సమాచారం.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర దివిని వరించిందట. మంచి రోల్ కావడంతో దివి కూడా ఓకే చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.
కాగా, `బిగ్‌బాస్-4` ఫినాలే కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కూడా దివికి సినిమా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. కానీ, చిరంజీవి ఆఫర్ కంటే పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం గమనార్హం.