శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Modified: సోమవారం, 24 జూన్ 2019 (16:03 IST)

సీఎం జగన్ మాటతో దిల్ రాజు తితిదే 'బూరెల బుట్ట'లో పడుతున్నారా?

ఓం నమో వేంకటేశాయ. అబ్బ... ఈ నామం స్మరించడంలో వున్న అనుభూతి అంతాఇంతా కాదు. ఈ నామ స్మరణ చేస్తూ సాక్షాత్తూ ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆయన పాదపద్మములు సేవించే అవకాశం లభిస్తే... ఇంక కావాల్సిందేముంది. ఇలాంటి అవకాశం చాలా కొద్దిమందికే లభిస్తుంటుంది. 
 
తాజాగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజుకి ఈ భాగ్యం కలుగుబోతోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. తితిదే పాలకమండలిలో దిల్ రాజుకి సభ్యుడయ్యే ఛాన్స్ వస్తుందని చెప్పుకుంటున్నారు. దీనికితోడు మొన్న తితిదే చైర్మన్‌గా బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి స్వీకరించే సమయంలో దిల్ రాజు హాజరయ్యారు. దీనితో ఆయనకు బోర్డులో సభ్యుని పదవి రాబోతోందంటూ వార్తలు వచ్చాయి.
 
ఇదిలావుంటే.. దిల్ రాజు స్నేహితుడు, పీవీపి కూడా ఆయనకు పదవి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తెలంగాణ నుంచి కూడా దిల్ రాజుకి మద్దతుగా కేటీఆర్ మాట సాయం చేశారని అంటున్నారు. అదలావుంటే దిల్ రాజు శ్రీ వేంకటేశ్వరునికి పరమ భక్తుడు. కనుక ఆ తితిదేలో స్థానం వుంటుందని అనుకుంటున్నారు.