సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (13:41 IST)

గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ తీవ్ర హెచ్చరిక... ఏంటది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా సుమారుగా రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాల వారీగా ఈ గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. 
 
రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో 1,84,498 మంది గ్రామ వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. గ్రామ వాలంటీర్లు ఇంకా ఎంపికకాకముందే... వారికి ముఖ్యమంత్రి జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 
 
అవినీతి లేకుండా చేసేందుకే ఒక్కో గ్రామ వాలంటీర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందజేయనున్నారు. పైగా, అవినీతికి తావు లేకుండా పని చేయాలన్నారు. ఏమాత్రం తప్పు జరిగిందని తెలిస్తే ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఆ వాలంటీర్‌ను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.