సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (13:20 IST)

వృద్ధులకు వైఎస్సార్ పెన్షన్.. యువతకు జగన్ కానుక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.


ఆపై ప్రసంగిస్తూ.. ,648 కిలోమీటర్లు ఈ నేల మీది నడిచినందకు, మీలో ఒకడిగా నిలిచినందుకు, ఆకాశమంత విజయాన్ని అందించిన మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు చెబుతున్నానని వెల్లడించారు. పేజీలకు పేజీల మేనిఫెస్టో తీసుకురాలేదని... మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా మార్చుతానని చెప్పారు. మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చుతానని చెప్పారు. మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. 
 
అలాగే వృద్ధులకు వైఎస్సార్ పెన్షన్, వైఎస్సార్ కానుకగా పెన్షన్లను ప్రతీ ఏడాది రూ.250లను పెంచనున్నట్లు హామీ ఇచ్చారు. విడదల వారీగా పెన్షన్లను పెంచుతామని చెప్పారు. తొలుత రూ.2.250ల పెన్షన్‌ను వృద్ధులకు అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే తొలి సంతకం వృద్ధుల పెన్షన్ల ఫైలుపై చేశారు. ఈ పెన్షన్ రెండో సంవత్సరం రూ.2.500లుగా, మూడో ఏడాది రూ.2.750గా, నాలుగో ఏడాది రూ.3వేల రూపాయలకు పెంచనున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
ఇంకా యువతకు కూడా జగన్మోహన్ రెడ్డి కానుక ప్రకటించారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీరును ఏర్పాటు చేస్తామని.. వారికి నెలకు రూ.5వేల జీతాన్ని ఇస్తామని.. ఈ ప్రక్రియను ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తామని చెప్పారు.

యువతను వాలంటీర్లుగా నియమించడం ద్వారా లంచాలకు అడ్డుకట్ట వేయవచ్చునని చెప్పారు. ఇంకా నిరుద్యోగత తొలగించేందుకు ఇది ఎంతో పనికొస్తుందని.. యువతకు  మంచి ఉద్యోగాలు లభించేంతవరకు వాలంటీర్లుగా సేవలు చేస్తూ జీతాలు పొందవచ్చునని జగన్ వ్యాఖ్యానించారు.