శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 30 మే 2019 (12:14 IST)

జగన్ ప్రమాణస్వీకారానికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకే.. ఎందుకిలా..?

ఏపీ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి. అడుగడుగునా పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా విభజన తరువాత రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉండడం.. ఉద్యోగులకు జీతాలు ఇస్తుండడంతో ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుండడంతో రాష్ట ఖజానా నిలువెల్లా నీరసపడిపోతోంది. ఎక్కడా వచ్చే ఆదాయానికి మించి ఖర్చు ఉండకూడదని సాధారణ కుటుంబాల్లోనే బడ్జెట్ ఏర్పాటు చేసుకుంటారు.
 
కానీ, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం విషయంలో దుబారాకు పెద్ద పీట వేసింది. ఎవరు ఏరి కోరితే అది ఇచ్చేసింది. అవసరం ఉన్నా లేకున్నా కూడా. అవసరం లేకున్నా ప్రజాధనాన్ని తన అనుచరులు, తనకు భజన చేసిన వారికి చంద్రబాబు కట్టబెట్టారన్న విమర్శలు లేకపోలేదు. దీంతో పట్టుమని ఐదేళ్ళు కూడా తిరగ్గకుండానే రాష్ట్రంల రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ నుంచి రూ.2.6 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌కు చేరింది. ఇప్పుడు అధికారంలోకి రాబోతున్న జగన్ దీనిపైనే దృష్టి పెట్టారు. 
 
నెలకు రూ.20 వేల కోట్ల రూపాయల వరకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితులో ఉంటే జగన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముందుగానే తానే ఐకాన్‌గా మారాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 30వ తేదీన ఏపీ నూతన రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అయిన జగన్ ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చును భారీగానే తగ్గించేశారు. 
 
2014 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎంగా చంద్రబాబు  ప్రమాణ స్వీకారానికి చేసిన ఖర్చు రూ.5 కోట్ల రూపాయలకు పైగానే. ఆ తర్వాత కృష్ణపుష్కరాలు, గోదావరి పుష్కరాలతో బాగా ఖర్చు చేసేశారు. ఈ కారణంగానే ఏపీ ప్రభుత్వం అప్పుల పాలైందని జగన్ గుర్తించి పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతగా గుర్తించారు.
 
జగన్ తన ప్రమాణ స్వీకారాన్ని సాదాసీదాగా నిర్వహించాలని సీఎస్ ఎల్వీ.సుబ్రమణ్యంను ఆదేశించారట. మొత్తం ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందని జగన్ అడిగినప్పుడు కనీసం ఐదు నుంచి రూ.10 లక్షల మధ్య అవుతుందని చెప్పారట. దీంతో అలా అవడానికి వీల్లేదు. ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు ప్రజలు మనకు పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు వారి ఆదాయాన్ని నేరు ఖర్చు పెట్టలేను. కాబట్టి రెండు లక్ష రూపాయలకు మించి ఖర్చు చేయవద్దని చెప్పారట. 
 
ఈ క్రమంలోనే విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ స్టేడియం ఎలాగో ప్రభుత్వానిదే. కుర్చీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక వచ్చేవారికి ప్రభుత్వ అతిథి గృహాల్లో బస ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్న జగన్‌ను చూస్తే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.