ఉద్యోగులకు షాకిచ్చిన జియో.. ఐదువేల మందిపై వేటు..

JioFi
Last Updated: గురువారం, 30 మే 2019 (10:57 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియో తాజాగా ఉద్యోగులకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు ఐదువేల మంది ఉద్యోగులను రిలయన్స్ టెలికాం సంస్థ జియో తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మార్కెట్లో పోటీ పెరగడం, నిర్వహణా లాభం పెంచాల్సిన అవసరం రావడంతో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంతో ఈ మేరకు ఉద్యోగులను జియో తొలగించిందని సమాచారం. 
 
ఈ వ్యవహారంపై జియోకు సంబంధించిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఉద్యోగులను తొలగించినప్పటికీ... కొత్తగా చేర్చుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని తెలిపారు. జియో సంస్థలో ప్రస్తుతం 15వేల నుంచి 20వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తొలగించిన వారిలో వీరిలో భారీ సంఖ్యలో పర్మినెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం.దీనిపై మరింత చదవండి :