శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (13:10 IST)

వైఎస్ ఫ్యామిలీని నమ్ముకుంటే అందలమెక్కిస్తారు...

వైఎస్ కుటుంబాన్ని నమ్ముకునివుంటే... అందలమెక్కిస్తారన్న ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఇది మరోమారు నిరూపితమైంది. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర సమయంలో ఆయన వెంట అడుగులో అడుగువేసుకుంటూ నడిచిన ఓ డాక్టర్‌‌కు ఇపుడు కీలక పదవి వరించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆయన పేరు హరికృష్ణ. చిన్నపిల్లల వైద్యుడు. ఈయనకు వైఎస్ఆర్ అన్నా.. ఆయన కుటుంబమన్నా ఎంతో ఇష్టం. వైఎస్ షర్మిల చేసిన పాదయాత్రలో 3,112 కిలోమీటర్లు నడిచిన ఆయన, వైఎస్ జగన్ పాదయాత్రలో 3,648 కిలోమీటర్లూ నడిచారు. 
 
తమ కుటుంబాన్ని నమ్మిన వారికి అన్యాయం చేయబోరన్న పేరున్న వైఎస్ జగన్, ఆయన్ను ఇప్పుడు కీలక పదవిలో నియమించారు. ఏకంగా తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా పని చేసే అవకాశాన్ని హరిషృష్ణకు కల్పించారు.
 
అనంతపురం జిల్లా కొత్తచెరువులో చిన్న పిల్లల క్లీనిక్‌‌ను నడిపించే డాక్టర్‌ హరికృష్ణ, వైద్య వృత్తిలో కొనసాగుతూనే, వైఎస్‌ కుటుంబంపై అపరిమిత అభిమానాన్ని చూపిస్తూ వచ్చారు. దాదాపు రెండేళ్ల క్రితం జగన్ పాదయాత్రను ప్రారంభించగా, ఆయన అడుగులో అడుగేశారు. 
 
ప్రజలు జగన్‌‌కు ఇచ్చే వినతులను ఆయనే స్వీకరించారు. పాదయాత్రలో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. జగన్‌మోహన్ రెడ్డికి అందుబాటులో ఉంటూ, కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే, ఆయనకు అందించేవారు.
 
అంతేనా.. పాదయాత్ర ముగిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, హరికృష్ణను స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో తమ ప్రాంతానికి చెందిన డాక్టర్‌కు కీలక హోదా లభించిందని కొత్తచెరువు ప్రాంత వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.