శనివారం, 1 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (11:17 IST)

''గ్యాంగ్ స్టర్'' ఛాన్స్ రాకపోతే బ్లూ ఫిలిమ్‌లో నటించేదాన్ని: కంగనా రనౌత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్‌గా మంచి పేరున్న ఈమె ఎలాంటి గ్లామర్ రోల్స్ పోషించేందుకైనా వెనుకాడదు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఈమె సొంత

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్‌గా మంచి పేరున్న ఈమె ఎలాంటి గ్లామర్ రోల్స్ పోషించేందుకైనా వెనుకాడదు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఈమె సొంతం. 'తను వెడ్స్ మను', 'క్వీన్' లాంటి సినిమాలు కంగనా రేంజ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడంలో ఈమెకు ఈమె సాటి. 2006లో 'గ్యాంగ్ స్టర్' సినిమాతో బాలావుడ్ లోకి కంగనా ఎంట్రీ ఇచ్చింది. 
 
ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చెబుతూ... దీనికి ముందు తనకు మరో సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. అది ఏమంత మంచి సినిమా కాకపోయినా... అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాను ఒప్పుకోవాల్సి వచ్చిందని కంగనా రనౌత్ చెప్పింది. అప్పట్లో ఫోటో షూట్ కూడా చేశారని తెలిపింది. ఆ తర్వాత తనకు ఇచ్చిన కస్ట్యూమ్ రోబ్‌లో దుస్తులేమీ లేవని కంగనా రనౌత్ వెల్లడించింది.
 
దీంతో తాను నటించబోయేది నీలిచిత్రమేమో అననిపించిందని తెలిపింది. సరిగా అదే సమయంలో 'గ్యాంగ్ స్టర్' మూవీలో అవకాశం రావడంతో... ఈ ప్రాజెక్టును వదిలేశానని చెప్పింది. సదరు సినిమా నిర్మాత తనపై ఫైర్ అయ్యాడని చెప్పింది. అప్పట్లో తనకు 17, 18 ఏళ్ల వయసు ఉండేదని... అప్పుడున్న పరిస్థితుల్లో 'గ్యాంగ్ స్టర్' సినిమా రాకపోతే, ఆ సినిమాలో నటించేదానినని వెల్లడించింది.