గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (20:47 IST)

ఎన్టీఆర్ ఉత్సాహానికి కార‌ణం అదేనా!

NTR
నంద‌మూరి తార‌క రామారావు (జూనియ‌ర్ ఎన్‌టిఆర్‌) ప్ర‌స్తుతం ఓ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే కార్య‌క్ర‌మం చేస్తున్నారు. ఇంత‌కుముందు నాగార్జున చేసిన ఈ ప్రోగ్రామ్ పేరును అటూఇటూగా మార్చి నిర్వాహ‌కులు ఎన్‌.టి.ఆర్‌.ను తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ వ‌ల్ల ఎంద‌రో మ‌నుషుల వ్య‌క్తిగ‌తాలు, వారి క‌ష్ట‌ప‌డే త‌త్వం ఒక్కో మెట్టు ఎదిగే క్ర‌మాన్ని తెలుసుకున్నాన‌ని గ‌తంలో నాగార్జున ప్ర‌క‌టించాడు. ఆయ‌న చేసిన ప్రోగ్రామ్‌లు ప్ర‌జ‌లు బాగా క‌నెక్ట్ అయ్యారనే చెప్పాలి. 
 
అయితే ఆ త‌ర్వాత రొటీన్‌గా వుంటుంద‌ని నాగార్జున త‌ప్పుకున్నారు. ఎన్‌.టి.ఆర్‌. అయితే బాగుంటుంద‌ని నిర్వాహ‌కులు తీసుకున్నారు. మొద‌ట్లో బాగానే అనిపించినా, క్ర‌మేణా అది ఎఫెక్టివ్‌గా లేద‌నేది ఇండ‌స్ట్రీ టాక్‌. బ‌య‌ట కూడా ఈ ప్రోగ్రామ్ గురించి గొప్ప‌గా చెప్పుకునేట్లుగా లేదు. ఎన్‌.టి.ఆర్‌. చేసిన విధానంలో చాలామందికి ఆస‌క్తిలేద‌ని వార్త‌లు వినిపించాయి. ఓ సంద‌ర్భంలో అస‌లు ఎన్‌.టి.ఆర్‌. త‌ప్పుకుంటున్నాడ‌ని రూమ‌ర్లు కూడా వ‌చ్చాయి. ఇవ‌న్నీ గ‌మ‌నించారో ఏమో నిర్వాహ‌కులు ఈరోజు ఎన్‌టిఆర్‌. జోష్‌గా వున్నాడంటూ పిక్‌ల‌ను పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా కనిపిస్తున్నాడని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ జోష్‌కు కార‌ణం తెలుసుకోవాలంటే ప్రోగ్రామ్‌ను చూడాల్సిందే అన్న‌ట్లు దాని సారాంశం.
 
ఎప్పుడూ లేని అంత‌లా ప్ర‌చారం చేయ‌డానికి కార‌ణం బ‌య‌ట రూమ‌ర్ల‌ను చెక్ పెట్టేందుకేన‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అనుకున్నంత‌గా ఆయ‌న‌కు పారితోషికం ఇచ్చేశారు గ‌క‌నుక మ‌ధ్య‌లో త‌ప్పుకునేలేద‌ని కూడా తెలుస్తోంది. మ‌రి ఎన్‌.టి.ఆర్‌. ఈ కార్య‌క్ర‌మం ఏమేర‌కు  హైప్ తెస్తారో చూడాల్సిందే.