సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (14:23 IST)

శ్రుతి పోతే పోయింది.. అనుష్క, నయన వద్దే వద్దు.. హన్సికనే ముద్దంటున్న సుందర్‌ సి?

బాహుబలి సినిమా విడుదలకు తర్వాత అలాంటి సినిమాలను తెరకెక్కేందుకు రంగం సిద్ధం అవుతోంది. మహాభారతం, రామాయణం వంటి సినిమాలు ఇప్పటికే సెట్స్‌కు వెళ్లనుండగా, సుందర్ సి పలు భాషల్లో రూపొందించాలనుకున్న సంఘమిత్ర క

బాహుబలి సినిమా విడుదలకు తర్వాత అలాంటి సినిమాలను తెరకెక్కేందుకు రంగం సిద్ధం అవుతోంది. మహాభారతం, రామాయణం వంటి సినిమాలు ఇప్పటికే సెట్స్‌కు వెళ్లనుండగా, సుందర్ సి పలు భాషల్లో రూపొందించాలనుకున్న సంఘమిత్ర కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
 
జయం రవి, ఆర్య ప్రధాన పాత్రలలో రూపొందనున్న ఈ సినిమా నుంచి సంఘమిత్ర పాత్రకు శ్రుతిహాసన్‌ను ముందుగా అనుకున్నా.. ఆమెను నిర్మాతలు తప్పించడంతో.. హన్సిక సంఘమిత్రగా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
సంఘమిత్ర కోసం శ్రుతిహాసన్ గుర్రపు స్వారీలు, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న తరుణంలో ఆమె తప్పుకోవడంతో అనుష్క సంఘమిత్రగా నటించనుందని టాక్ వచ్చింది. నయనతార కూడా సంఘమిత్ర రేసులో నిలిచింది. అయితే చివరికి హన్సిక మాత్రమే సంఘమిత్రకు ఫైనల్ అయ్యింది. ఇప్ప‌టికే సుంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్సిక చంద్రకళ, కళావతి అనే సినిమాలు చేయ‌గా, ఇప్పుడు సంఘ‌మిత్ర‌లోను హన్సికనే ఖరారు చేసినట్లు సమాచారం.