హైపర్ ఆదికి పెళ్లి.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:52 IST)
జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గా తెలుగు తెరకు పరిచయమైన హైపర్ ఆది ఈ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపును సొంతం చేసుకున్నారు.  అంతేకాదు అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటించే ఆది పంచులకు విపరీతమైన ఆదరణ ఉంది. ఇదిలా ఉండగా వివాహం ఎప్పుడు చేసుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
 
కానీ గత కొన్నాళ్ళ క్రితం యాంకర్ వర్షిణితో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఇప్పటికే అనేకసార్లు హైపర్ ఆది లవ్ , మ్యారేజ్ గురించి బోలెడు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలోనే తాజాగా హైపర్ ఆదికి నిశ్చితార్థం అయ్యిందని, అది కూడా ఒక స్టార్ హీరోయిన్ తో అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక షోలో హైపర్ ఆదికి ఒక హీరోయిన్ తో నిశ్చితార్థం జరిగినట్లు చూపించారు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈటీవీలో ప్రతి బుధవారం డాన్స్ రియాల్టీ షో ఢీ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం టీం లీడర్లు , జడ్జిల మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు చూపించడం కామన్ అయిపోయింది. 
 
ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 19వ తేదీన ప్రసారం కాబోయే ఎపిసోడ్లో టీం లీడర్ హైపర్ ఆదికి, హీరోయిన్ శ్రద్ధదాస్ కి ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రోమో కట్ చేసి వదిలేశారు షో నిర్వాహకులు. ఇక హైపర్ ఆది , శ్రద్ధదాస్ మధ్య ప్రేమ ఉన్నట్లు ఒక సాంగ్ కి డాన్స్ కూడా చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అన్నీ చూడండి

ప్రేయసికి అసభ్య సందేశాలు పంపిన ఫ్రెండ్, మర్మావయాలు నలిపేసి హతమార్చారు

కరూర్‌లో తొక్కిసలాట.. స్మారక చిహ్నం ఏర్పాటు.. సీఎం విజయ్

YS Jagan: ఖమ్మం రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. జగన్, రేవంత్, భట్టి చిత్రాలతో బ్యానర్లు

హైదరాబాదులో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు.. రూ. 77.31 కోట్లు మంజూరు

మద్యం మత్తులో ఏకంగా బస్సును దొంగలించాడు.. 21 కిలోమీటర్లు నడిపాడు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?

ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం

ఆర్తి ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు

బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?

రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

తర్వాతి కథనం
Show comments