గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జులై 2023 (12:21 IST)

ఇలియానా కడుపు పండింది.. రెడ్ డ్రెస్‌లో బేబీ బంప్ ఫోటో

Iliyana
Iliyana
సోషల్ మీడియాలో తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన దేవదాసు హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. పూర్తిగా అభివృద్ధి చెందిన బేబీ బంప్‌ను ఫోటోలో చూపించింది. ఇలియానా బుధవారం నాడు రెడ్ డ్రెస్,  మేకప్‌లో దిగిన ఇన్‌స్టాగ్రామ్ సెల్ఫీని పోస్ట్ చేసింది. 
 
ఇటీవలే ఇలియానా తను ప్రేమించిన వ్యక్తి గురించి అందరికి చెప్పింది. తనకు కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడున్నాడని, వేదన నుండి బయటపడేలా చేశాడని ఇలియానా తెలిపింది. అండగా నిలిచి జీవితంలో నవ్వులు పూయించాడని ఇలియానా చెప్పింది. 
 
కానీ ఇలియానా తను ఎవరితో ప్రేమలో వుందో బహిరంగంగా వెల్లడించనప్పటికీ, అందరూ ఆయనను తన మొదటి బిడ్డకు తండ్రి అని అనుకుంటున్నారు.