శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (17:54 IST)

ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో విజయ్ దేవరకొండ సినిమా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఫైటర్. కరోనా కారణంగా ఆగింది కానీ లేకపోతే ఈపాటికే ఫైటర్ పూర్తి అయ్యేది. త్వరలోనే ఫైటర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నారు.
 
మజిలీ తర్వాత వెంటనే విజయ్‌తో మూవీ చేయాలనుకున్నాడు కానీ.. ఫైటర్ స్టార్ట్ అవ్వడంతో శివ నిర్వాణ నానితో టక్ జగదీష్ మూవీ స్టార్ట్ చేసాడు. విజయ్ చేస్తున్న ఫైటర్, శివ నిర్వాణ చేస్తున్న టక్ జగదీష్.. చిత్రాలు పూర్తి అయన తర్వాత విజయ్ - శివ నిర్వాణ సినిమా స్టార్ట్ చేస్తారు. ఇక ఈ సినిమా స్టోరీ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
 
అది ఏంటంటే.. ఇది ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే విభిన్న ప్రేమకథా చిత్రమని తెలిసింది. ఇందులో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తాడని.. ఈ క్యారెక్టర్ విజయ్‌కి చాలా మంచి పేరు తీసుకువచ్చేలా ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. శివ నిర్వాణ ప్రేమకథలను ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తాడో తెలిసిందే.
 
విజయ్‌తో కూడా ప్రేమకథా చిత్రం తీయనున్నాడని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. ఇందులో విజయ్ సరసన ఎవరు నటిస్తారో..? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతాదో త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.