మహేష్ బాబు విలన్‌గా నటిస్తున్నాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు విలన్‌గా నటించనున్నాడా..? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు దర్శకనిర్మాతలు, హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తుండటం తెలిసిందే. దీంత మరి కొంతమంది హీరోలు కూడా కలిసి సినిమా చేయాలనుకుంటున్నారట.
అసలు విషయానికి వస్తే... మహేష్ విలన్‌గా నటించనున్నాడు. అది కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో మహేష్ విలన్ అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. తెలుగు, తమిళ్‌లో రూపొందే ఈ భారీ చిత్రంలో తమిళంలో మహేష్ బాబు విలన్ కాగా, తెలుగులో విజయ్ విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారట. ఇదే కనుక నిజమైతే.. మహేష్, విజయ్ అభిమానులకు పండగే.