Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ పుష్పలో హీరోయిన్‌ని మార్చేస్తున్నారా?

Written By శ్రీ
Updated: బుధవారం, 22 ఏప్రియల్ 2020 (23:23 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. టైటిల్‌కి సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగానే వచ్చినా..  కొంతమంది మాత్రం టైటిల్ ఏంటి ఇలా ఉంది..? అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. 
 
ఏది ఏమైనా ఆర్య ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ - సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
 ఇదిలా ఉంటే..  ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇందులో కథానాయికను మార్చేస్తున్నారని. అదేంటి.. రష్మిక ఇంకా సెట్స్‌లో రాలేదు. ఆమెపై ఒక్క సీన్ కూడా ఇంకా తీయలేదు. ఇంతలో ఏమైందని. హీరోయిన్ మార్చేయడానికి అని ఆరా తీస్తే..? తెలిసింది ఏంటంటే... రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకోవడం లేదని తెలిసింది. 
 
మరి.. ఈ వార్త ఏంటి అంటే.. మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని తెలిసింది. ఆ పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్‌ని కాంటాక్ట్ చేసారని టాక్ వినిపిస్తోంది.
 
 దర్బార్ సినిమాలో రజనీకాంత్ కూతురుగా నటించినప్పటి నుంచి నివేదా థామస్‌కి ఇటు టాలీవుడ్‌లోను అటు కోలీవుడ్‌లోను మంచి క్రేజ్ వచ్చింది. రీసెంట్‌గా నాని వి సినిమాలో నటించింది. బన్నీ పుష్పలో నటించే ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments