శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (12:11 IST)

చెర్రీతో జాన్వీ కపూర్ రొమాన్స్.. పుష్ప-2లో ఐటమ్ సాంగ్?

jhanvi kapoor
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ తొలి సినిమా అరంగేట్రం చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ మెగా హీరోతోనే అని తెలిసింది. 
 
రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఆర్ఆర్ఆర్‌తో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా మారిన చెర్రీ సరసన నటించేందుకు జాన్వీ సిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప2లో స్పెషల్ సాంగ్ కోసం జాన్వీని సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.