సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 8 అక్టోబరు 2018 (20:51 IST)

ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర రావు అలాంటి ప్ర‌యోగం చేస్తున్నాడా..?

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచి.. వంద చిత్రాల‌కు పైగా సినిమాల‌ను తెర‌కెక్కించి.. ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న డైరెక్ట‌ర్ ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు. స్టార్ హీరోలు, యువ హీరోల‌తో సినిమాలు తీసిన రాఘ‌వేంద్ర‌రావు ఇటీవ‌ల కాలంలో కాస్త బ్రేక్ తీసుకున్నారు. అయితే... ఇప్పుడు ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేయాల‌నుకుంటున్నార‌ట‌.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే.... ఈమధ్య కాలంలో తెలుగు సినిమా బడ్జెట్ అమాంతం పెరిగి పోయింది. స్టార్ హీరోల సినిమాలు మినిమం 40 నుండి 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే... పెళ్లి చూపులు, ఆర్ ఎక్స్ 100, కేరాఫ్ కంచరపాలెం.. చిత్రాలు అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది సంచ‌ల‌నం సృష్టించాయి.
 
అయితే... ఈ సినిమాల స్పూర్తితో రాఘవేంద్ర రావు 50 లక్షల బడ్జెట్‌తో కంటెంట్ ప్రధానమైన సినిమాను తీయాలనుకుంటున్నార‌ట‌. చిన్న బడ్జెట్ చిత్రం కంటెంట్ ప్రధానమైన చిత్రాన్ని తెరకెక్కించగల సత్తా త‌న‌లో ఉంద‌ని  నిరూపించుకోవాల‌నుకుంటున్నార‌ట‌. అయితే.. క‌థ ఏంటి..? హీరో ఎవ‌రు..? అనేది మాత్రం చెప్ప‌లేదు. త్వ‌ర‌లో అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.