శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (15:44 IST)

సీఎం రమేష్ ఉక్కు దీక్షకు.. దర్శకేంద్రుడు మద్దతు.. మోడీ దిగిరాక తప్పదు

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన ఉక్కు దీక్షకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తన సంఘీభావాన్ని తెలిపారు. అలాగే, పలువురు మంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. ఈ దెబ్బకు ప్రధాని నరేంద్ర

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన ఉక్కు దీక్షకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తన సంఘీభావాన్ని తెలిపారు. అలాగే, పలువురు మంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. ఈ దెబ్బకు ప్రధాని నరేంద్ర మోడీ దిగిరాక తప్పదని దర్శకేంద్రుడు జోస్యం చెప్పారు.
 
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. ఈ దీక్షకు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటానికి ప్రధాని మోడీ దిగి రాక తప్పదని, స్టీల్ ప్లాంట్ ఇచ్చి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు చేస్తున్న పోరాటం ఎంతో అవసరమని అన్నారు. అలాగే, సీఎం రమేష్ చేస్తున్న దీక్షకు డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, గంటా శ్రీనివాస్, ఎంపీ టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే బోండా ఉమ తమ సంఘీభావం తెలిపారు.