సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 22 సెప్టెంబరు 2018 (19:36 IST)

కళ్యాణ్‌ రామ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు.. ఏంటది?

తెలంగాణా ఎన్నికల్లో శేరిగంపల్లి నుంచి కళ్యాణ్‌ రామ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ యేడాది ఎమ్మెల్యేగా కనిపించిన కళ్యాణ్‌ రామ్ నిజ జీవితంలోను ఎమ్మెల్యే అవుతారన్నది టాక్. తండ్రి మరణం తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసి రాజకీయాల్లోకి వెళ్ళాలన్నది కళ

తెలంగాణా ఎన్నికల్లో శేరిగంపల్లి నుంచి కళ్యాణ్‌ రామ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ యేడాది ఎమ్మెల్యేగా కనిపించిన కళ్యాణ్‌ రామ్ నిజ జీవితంలోను ఎమ్మెల్యే అవుతారన్నది టాక్. తండ్రి మరణం తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసి రాజకీయాల్లోకి వెళ్ళాలన్నది కళ్యాణ్‌ రామ్ ఆలోచన.
 
నందమూరి కళ్యాణ్‌ రామ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జోరందుకుంది. నందమూరి హరిక్రిష్ణ మరణంతో హరిక్రిష్ణ కుటుంబంలోని ఎవరినో ఒకరిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. హైదరాబాద్‌లోని శేరింగంపల్లి నియోజకవర్గం నుంచి కళ్యాణ్‌ రామ్‌ను పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారట బాబు. ఇప్పటికే ఇదే విషయాన్ని కళ్యాణ్‌ రామ్‌కు చెప్పారట. రాజకీయాల్లోకి వెళ్ళేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పని కళ్యాణ్‌ రామ్ ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే సాధ్యమవుతుందా అని ప్రశ్నించారట.
 
నువ్వు నిలబడు.. మిగిలినది నేను చూసుకుంటానంటూ బాబు హామీ ఇచ్చారట. దీంతో కళ్యాణ్‌ రామ్ తెలంగాణా రాష్ట్రంలో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఒకవేళ శేరింగంపల్లి నియోజకవర్గ ప్రజలు టిఆర్ఎస్‌కు కాకుండా టిడిపికి ఓటేస్తే కళ్యాణ్‌ రామ్ ఎమ్మెల్యే అవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.