Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

''జయలలిత'' కోసం మహానటిని ఒప్పించారా?

''మహానటి'' సినిమాతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతోంది. తెలుగులో నేను శైల‌జతో తెరంగేట్రం చేసిన కీర్తి సురేష్.. ఆపై మహానటి సినిమా ద్వారా సూపర్ క్రేజ్ కొట్టేసింది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పా

Written By selvi
Updated: శనివారం, 25 ఆగస్టు 2018 (14:52 IST)
''మహానటి'' సినిమాతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతోంది. తెలుగులో నేను శైల‌జతో తెరంగేట్రం చేసిన కీర్తి సురేష్.. ఆపై మహానటి సినిమా ద్వారా సూపర్ క్రేజ్ కొట్టేసింది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పాత్ర‌లో కీర్తి అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి అందరికి తెలిసిందే. సినీ ప్ర‌ముఖులు కూడా కీర్తి ఆ పాత్రలో పూర్తిగా విలీనమై నటించిందని ప్రసంశల జల్లు కురుపించారు.
 
సావిత్రి పాత్ర‌లో జీవించిన కీర్తికి మ‌రో అరుదైన అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు సమాచారం. త‌మిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత‌క‌థ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ఇందులో న‌టించ‌మ‌ని కీర్తికి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని తెలిసింది. కానీ దీనిపై కీర్తి సురేష్ ఇంకా స్పందించలేదు. 
 
అయితే మరోవైపు తమిళ భాషల్లో అనుష్కకి మంచి క్రేజ్ వుంది. హిందీ ప్రేక్షకులకు కూడా దేవసేన సుపరిచితమే. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడంలో ఆమెది ప్రత్యేక స్థానం. అలాంటి అనుష్కను కూడా జయలలిత బయోపిక్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక జయలలిత సినిమాకి పురిచ్చి తలైవి, అమ్మ అనే రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో ఈ సినిమాను ఆరంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

అన్నీ చూడండి

అక్టోబర్ 10, 2026: శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఆదిలాబాద్ రైతులకు కనీస మద్దతు ధర.. పది సోయా సేకరణ కేంద్రాలు

నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది.. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఇంకా..?

ఉప ఎన్నికలు : తమిళనాడులో రెండు స్థానాల్లో విజిల్ గెలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

తర్వాతి కథనం
Show comments