బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:16 IST)

చిరు నుంచి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన యువ దర్శకుడు సుజిత్...

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మరో చిత్రంలో నటించేందుకు చిరంజీవి ప్లాన్ వేసుకున్నారు. ఇందులోభాగంగా, తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని యువ దర్శకుడు సుజిత్‌కు ఇచ్చారు. 
 
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన "లూసిఫర్" చిత్రానికి రీమేక్‌గా చిరంజీవి తెలుగులో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్ర మలయాళ హక్కులను హీరో కమ్ నిర్మాత రాంచరణ్ ఇప్పటికే కొనుగోలు చేయగా, ఆయనే ఈ చిత్రాన్ని సొంతంగా నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.
 
ఈ ప్రాజెక్టు తర్వాత చిరంజీవి మరో రెండు ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ఇవి కూడా యువ దర్శకులతోనే చేయనున్నారు. లూసిఫర్ ప్రాజెక్టు తర్వాతదర్శకుడు బాబీ .. మెహర్ రమేశ్ పోటీపడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లలో బాబీకి చిరంజీవి ఓకే చెప్పినట్టుగా సమాచారం. 
 
ఈ మధ్య 'వెంకీమామ'తో బాబీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాబీ కథ వినిపించగా, కథలోని కొత్తదనం పట్ల సంతృప్తి చెందిన చిరంజీవి ఆయనకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంమీద సుమారుగా దశాబ్దకాలం తర్వాత ఖైదీ నంబరు 150తో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస ప్రాజెక్టులు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పొచ్చు.