సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (16:04 IST)

మాళవిక మోహన్ ఇలా మారిపోయిందేమిటి?

Malavika Mohan
Malavika Mohan
'మాస్టర్' సినిమాలో మాళవిక మోహన్ నటించింది. ఐటమ్ గాళ్‌గా మెప్పించాలని చూసింది. కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు. ఇక, ఆమెకి సోలో హీరోయిన్‌గా కెరీర్ కట్ అయినట్టేనని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. అందుకే కాబోలు, మాళవిక మోహనన్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో బిజీగా మారుతోంది. 
 
ఇప్పటికే నాలుగు వెబ్ సిరీస్‌లు ఒప్పుకొంది ఈ భామ. పైగా అవన్నీ హిందీలోనే. హాక్స్, ఫింగర్ ప్రింట్ సీజన్ 2, ఫర్జీ వంటి వెబ్ డ్రామాలు మాళవిక మోహనన్ చేతిలో ఉన్నాయి. తెలుగులో రవితేజ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
 
ఈ సినిమా హిట్ అయి, తెలుగులో కెరీర్‌కి ఊపు రావాలి అంటే.. మరో ఏడాది పడుతుంది. అందుకే బోల్డ్ క్యారెక్టర్లకు ఓకే చెప్తోంది. ఇలా చేస్తేనే కెరీర్‌ను నెట్టుకురావాలని డిసైడ్ అయ్యింది.