మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (14:21 IST)

దిల్ రాజు, హరీశ్ శంకర్ కాంబినేష‌న్‌లో ఏటీఎమ్ వెబ్ సిరీస్

Dil Raju, Harish sankar and others
Dil Raju, Harish sankar and others
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ "ఏటీఎమ్". జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సి చంద్ర మోహన్ "ఏటీఎమ్" వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. థ్రిల్లర్ కథతో "ఏటీఎమ్" వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా...పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి  వివరాలు వెల్లడించనున్నారు.
 
నటీనటులు - వీజే సన్నీ, దివి తదితరులు
సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రఫీ - పీజీ విందా, సంగీతం - ప్రశాంత్ విహారి, నిర్మాతలు - హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, దర్శకత్వం - సి చంద్ర మోహన్