Daily Horoscope
✕

వచ్చే యేడాది పెళ్లి పీటలెక్కనున్న నయనతార! (video)

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (18:47 IST)
అటు కోలీవుడ్... ఇటు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్న హీరోయిన్ నయనతార. సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా కొనసాగుతోంది. అయితే, పలువురుతో ప్రేమాయణం కొనసాగించి అంతే హెడ్ లైన్స్‌లో నిలిచింది. 
 
ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీబిజీగా ఉన్న న‌య‌న్ త్వ‌ర‌లో పెళ్ళి చేసుకోనుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌య‌న‌తార తొలిసారి ప్రభుదేవా ప్రేమ‌లో ప‌డ‌గా, ఆయ‌న‌తో కొన్నాళ్ళు డేటింగ్ చేశాక గుడ్‌బై చెప్పింది. 
 
అనంత‌రం శింబుతో ప్రేమ‌ను కొన‌సాగించింది. వారిద్ద‌రి మ‌ధ్య బంధం కూడా ఎక్కువ రోజులు నిల‌వ‌లేకుండా పోయింది. ఇక ప్ర‌స్తుతం త‌మిళ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి ఉన్న న‌య‌న‌తార ఆయ‌నతో చెట్టా ప‌ట్టాలు, ఫెస్టివ‌ల్ సెల‌బ్రేష‌న్స్‌, విందులు, వినోదాలు వంటివి చేస్తూ ఫుల్ చిల్ అవుతుంది. 
 
వీరిద్ద‌రి పెళ్లికి సంబంధించి కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నా దీనిపై ఇద్ద‌రు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం మార్చి నెలలో తన ప్రియుడితో కలిసి నయనతార పెళ్ళిపీటలెక్కనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 
 
పెళ్లి త‌ర్వాత కూడా న‌య‌న‌తార సినిమాలు చేస్తుంద‌ట‌. అలానే భ‌ర్త‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూటర్‌గాను కొనసాగాలన్న బలమైన పట్టుదలతో నయనతార ఉన్నట్టు సమాచారం. 

 

అన్నీ చూడండి

నా చెల్లి లక్ష్మీ అపర్ణను గెలిపించండి : నటుడు జగపతిబాబు (వీడియో)

శశికళకు షాకిచ్చిన చక్రవర్తి : పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగింపు

కర్వా ‌చౌత్ రోజున భర్త ముఖం కాకుండా ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వివాహిత, పట్టేసారు, వీడియో

ఐటీ కంపెనీల్లో కన్నడిగులకే ఉద్యోగాలివ్వాలి : కర్నాటక రక్షణ వేదిక

మాట వినడం లేదని కన్నబిడ్డను గొంతునులిమి చంపేసిన తల్లి

అన్నీ చూడండి

విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...

తర్వాతి కథనం
Show comments