ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (09:23 IST)

నివేదాను పిలుపించుకున్న 'వకీల్ సాబ్'.. ఎందుకంటే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్". బాలీవుడ్ మూవీ 'పింక్'‌కు ఇది రీమేక్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు కలిసి నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చాలా మేరకు పూర్తయింది. అయితే, కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఇపుడు సినిమా షూటింగులకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో తిరిగి ప్రారంభమైంది. లాక్డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది.
 
ప్రస్తుతం పవన్ కల్యాణ్‌లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న కథానాయిక నివేద థామస్ కూడా మంగళవారం నుంచి ఈ చిత్రం షూటింగులో పాల్గొంటోంది. ఈ విషయాన్ని నివేద సోషల్ మీడియాలో వెల్లడించింది. 'తిరిగి షూటింగుకి రావడం బాగుంది..' అంటూ నివేద పోస్ట్ పెట్టింది.
 
కాగా, హీరో పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే ఈ చిత్రం షూట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్ర హీరోయిన్లు అంజలి, శ్రుతి హాసన్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.