గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:00 IST)

మాట తూటాలు పేల్చిన పవన్ : జగన్ సర్కారును చీల్చి చెండాడిన వైనం...

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక కాస్త రాజకీయ సభగా మారిపోయిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని అంతా వెళ్లగక్కారు. సుధీర్ఘ ప్రసంగంతో సినిమాపై కంటే బయట విషయాలపైనే చీల్చిచెండాడేశాడు. 
 
ఏపీలో సినిమా టికెట్స్ ప్రభుత్వం అమ్మకంపై ఘాటుగా స్పందించిన పవన్ మా ఎన్నికలపై కూడా స్పందించాడు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్‌ను లోకల్, నాన్-లోకల్ అంటూ విమర్శలు చేయటం తప్పు అని పవన్ సూటిగా చెప్పేశారు. 
 
ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్‌ను, ఆయన అభిప్రాయంగానే తీసుకున్నాను. అంతేగాని ఆయనతో నాకు గొడవలు ఏమీలేవు. సినిమా పరిశ్రమకు వచ్చే సరికి మేమంతా ఒకటి.. ఇక్కడ చాలా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని పవన్ తెలిపారు.
 
అటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, నాయకులు టార్గెట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్రపరిశ్రమను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేశం వ్యక్తం చేశారు. 
 
పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్ అన్నారు. ఇక ‘సాయితేజ్’ ప్రమాదంపై మీడియా చేసిన అతి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. కేవలం తన వల్ల సినీ పరిశ్రమను టార్గెట్ చేసి విధానం.. ఏపీలో జగన్ సర్కార్ తప్పిదాలను ఈ ఒక్క సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చీల్చిచెండాడేశాడు. 
 
ఒక్కో మాట తూటాల పేలింది. పవన్ కళ్యాణ్ మాటల తూటాలపై అటు వైకాపా నేతలు గానీ ఇటు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు గానీ నోరు విప్పకపోవడం గమనార్హం. మరి సోమవారం ఏమైనా వైకాపా నేతలు మీడియా ముందుకు వస్తారేమో చూద్ధాం.