సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:39 IST)

సాయి ధరమ్ కోసం కదిలిన పవర్ స్టార్

మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ ఈ నె 10వ తేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుంది. అయితే, ఈ హీరో నటించిన "రిపబ్లిక్" మూవీ వచ్చే నెల ఒకటో తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగనుంది. హీరో లేకుండానే జరుగుతున్న కార్యక్రమం కావడంతో తమ మేనల్లుడి కోసం మెగా ఫ్యామిలీ అంతా కదలనుంది. 
 
అక్టోబరు ఒకటో తేదీని పురస్కరించుకుని హీరో లేకుండానే దర్శకనిర్మాతలు ప్రమోషన్ మొదలుపెట్టారు. అయితే, తన మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. పోస్టర్ కూడా విడుదల చేశారు. 
 
హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ వేడుక జరుగనుంది. దీనికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్‌లో ఉన్న ఈ సమయంలో జరుగుతున్న ఈవెంట్ కావడంతో అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా పూర్తిగా సోషల్ మెసేజ్‌తో వస్తుంది. రమ్యకృష్ణ పవర్ లేడీ పొలిటీషియన్ పాత్రలో నటించగా, సాయిధరమ్ తేజ్ కలెక్టర్‌గా నటించారు.