బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:28 IST)

ప్రజల ఆశీర్వాదంతో విజయం: పవన్‌కల్యాణ్

రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో గెలిచిన జనసైనికులకు పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. వైసీపీ నేతల దాష్టీకాలను తట్టుకుని నిలబడ్డారని ఆయన కొనియాడారు.

కడియంలంకలో జనసేన జెండా ఎగురడం ఖాయమన్నారు. దీనిని అడ్డుకోవాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. వివాదం చేయాలని చూస్తే తానే స్వయంగా ఇక్కడకి వస్తానని ఆయన ప్రకటించారు.

సతీష్ అనే వ్యక్తిని పోలీసులే చితక బాదటం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. అయ్యప్ప అనే వ్యక్తిపై వైసీపీ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలలో పోలీసు అధికారులు ఎందుకు స్పందించ లేదన్నారు.

జరుగుతున్న వరుస ఘటనలపై  ఛీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమిషనర్, డీజీపీలు స్పందించాలన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేసారు.