యూనివర్శిటీలో కాల్పులు... 10 మంది మృత్యువాత
రష్యాలోని ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. రష్యాలోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 10 మందికి వరకు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం.
కాగా, త్వరలోనే రష్యా పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలో రక్తపాతం పారింది. ఆ దేశానికి చెందిన పెర్మ్ నగరంలో జరిగిన కాల్పుల్లో అనేక మంది మృతిచెందినట్లు ప్రాథమిక వార్తల సమాచారం.
ఓ యూనివర్సిటీ క్యాంపస్ జరిగిన ఈ కాల్పులకు ప్రధాన కారకుడైన దుండగుడిని పట్టుకున్నారు. ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భయంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.
పెర్మ్ నగరంలో ఉన్న వైద్య అధికారులు సుమారు 10 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. రష్యాలో ఉన్న అతిపురాతన యూనివర్శిటీల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.