రిపబ్లిక్ కోసం.. త్వరలో ఆస్పత్రి నుంచి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఒకవైపు కొందరు మెగా హీరోలు సోషల్ మీడియాలో తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ మూడు రోజుల క్రితమే వెంటిలేటర్ నుంచి తొలగించారట.
అలాగే ఐసియు నుంచి ఇప్పుడు సాయి ధరంతేజ్‌ని జనరల్ వార్డ్‌కి మార్చారు. మరొక రెండు మూడు రోజుల్లో తేజ్‌ను డిశ్చార్జ్ చేయొచ్చు అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్న సాయి ధరమ్ తేజ్ తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.
సాయి ధరంతేజ్‌ను పలకరించటానికి ఇప్పటికే పలు టాలీవుడ్ సెలబ్రిటీలు అపోలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా చూస్తే సాయి ధరమ్ తేజ్ తదుపరి సినిమా "రిపబ్లిక్ " అక్టోబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది.