సాయితేజ కోలుకోలేదు. కానీ సినిమా రిలీజ్ అవసరమా?
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వస్తున్న కథానాయకుడు సాయి ధరమ్‌తేజ్. తాజాగా ఆయన నటించిన సినిమా `రిపబ్లిక్`. ఈ సినిమా ఆరంభం పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ప్రారంభమైంది. కరోనా అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయాలని అనుకున్నారు. ఈలోగా దురదృష్టవశాత్తూ సాయితేజ్ బైక్ ప్రమాదానికి గురయై ఆసుపత్రిపాలయ్యారు. ఇప్పటికీ ఆయన కోలుకోలేదు. అయినా ప్రీరిలీజ్ వేడుకను శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. జె.ఆర్.సి. కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా హాజరయా్యరు. అక్కడ అభిమానుల సందడి నెలకొంది.
మరోవైపు రిపబ్లిక్ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి తన ఇంటివద్దే లాప్‌టాప్లో ఆవిష్కరించారు. దర్శకుడు దేవకట్టా నిర్మాతలు సమక్షంలో ట్రైలర్ విడుదల జరిగింది. వారితోపాటు జీటీవీ తెలుగు ప్రతినిధి ప్రసాద్ కూడా వున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, సాయి ధరమ్ తేజ్ దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఇంకా కోలుకోలేదు. మీ అందరి ఆదరాభిమానలతో త్వరలో కోలుకుంటారని ఆశిస్తున్నాను. అసలు ఇలాంటి టైంలో ఫంక్షన్ అవసరమా? అక్టోబర్ 1న విడుదల చేయాలా? అని చాలా మందిలో అనుమానం వుంటుంది. కానీ ఇది సాయిధరమ్ తేజ్ కోరిక. సినిమా ప్రారంభం రోజునే అక్టోబర్ 1నే విడుదల కావాలని సాయితేజ్ చెప్పారు. ఎందుకంటే తర్వాత రోజు గాంధీ జయంతి. ఈ కథ కూడా దేశానికి సంబంధించింది. గాంధీ ఆశయాలకు అనుగుణంగా కథను తయారు చేశారు. సామాజిక రాజకీయ అంశాలు ఇందులో వున్నాయి. కనుకనే అక్టోబర్ 1నే విడుదలచేయడం సమంజసనం అని తెలిపారు.