సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (17:14 IST)

అప్ప‌డు ప‌వ‌న్ సినిమా ప్రారంభ‌మైతే - నేడు సాయితేజ్ ప్రీరిలీజ్

Pawan Kalyan, Supriya, Chiranjeevi, Nagababu, EVV
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, సుప్రియ నాయకా నాయికలుగా నటించారు. ఇది కథానాయకుడిగా పవన్ కల్యాణ్ మొదటి సినిమా. కథానాయిక సుప్రియకు కూడా ఇది మొదటి సినిమా. ఈమె అక్కినేని నాగేశ్వరరావుకు మనవరాలు. నటుడు సుమంత్ కు చెల్లెలు. ఈ సినిమా `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ సినిమాకు పునర్నిర్మాణం.
 
ఈ  చిత్రం ప్రారంభోత్స‌వం సెప్టెంబ‌ర్ 25న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు హాజ‌రైన‌ప్ప‌టి దృశ్యం. త‌న సోష‌ల్‌మీడియాలో ప‌వ‌న్ అభిమానులు దీన్ని గుర్తు చేస్తూ పెట్టారు. మ‌ర‌లా ఇదేరోజు యాదృశ్చిక‌మైనా ఈరోజు సాయంత్రం సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన `రిప‌బ్లిక్‌` సినిమా ప్రీరిలిజ్ జూబ్లీహిల్స్‌లో జ‌ర‌గ‌బోతుంది. ఈ సంద‌ర్భంగా అభిమానులు గుర్తుచేస్తూ ఇలా పంచుకున్నారు. ఇటీవ‌లే సాయితేజ్ రోడ్డు ప్ర‌మాదంనుంచి కోలుకుని తొలిసారిగా బ‌య‌ట‌కు రాబోతున్నాడు. ఈ వేడుక‌కు ఇప్ప‌టికే గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.