శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (11:18 IST)

'ఐ యామ్ బ్యాక్.. ఆర్ యు రెడీ' అంటున్న బాలీవుడ్ భామ.. ఎవరు?

'ఐ యామ్ బ్యాక్.. ఆర్ యు రెడీ' అంటోంది ఓ బాలీవుడ్ భామ. ఆమె ఎవరో కాదు.. పూజా హెగ్డే. ‘మొహంజొదారో’ లాంటి భారీ చిత్రంలో నటించిన పూజా హెగ్డే… మళ్లి తెలుగు సినిమా అవకాశం దక్కడంతో తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తో

'ఐ యామ్ బ్యాక్.. ఆర్ యు రెడీ' అంటోంది ఓ బాలీవుడ్ భామ. ఆమె ఎవరో కాదు.. పూజా హెగ్డే. ‘మొహంజొదారో’ లాంటి భారీ చిత్రంలో నటించిన పూజా హెగ్డే… మళ్లి తెలుగు సినిమా అవకాశం దక్కడంతో తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ సంతోషపడుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘దువ్వాడ జగన్నాథమ్‌’లో నటిస్తున్న పూజా... తెలుగులో ఆమె నటిస్తున్న మూడో చిత్రమిది. ‘ఒకలైలా కోసం’, ‘దోచెయ్‌’లో నటించినా…. విజయాలు దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది.
 
ఈ నేపథ్యంలో 'డీజే'లో ఛాన్స్ దక్కడంతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై ఆమె స్పందిస్తూ తెలుగులో గతంలో నటించిన చిత్రాల్లో సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించాను. కానీ కొత్త చిత్రంలో నా అందం చూస్తారు. గ్లామర్‌ డాల్‌‌గా ఉండే అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. ‘మొహంజొదారో’ సినిమా కోసం ముంబై వెళ్లే సమయానికి నాకు తెలుగు ఒక్క ముక్క రాదు. చిన్న చిన్న సంభాషణలు అర్థం చేసుకోవడమే కష్టమయ్యేది. కానీ ఇప్పుడు తెలుగు బాగా అర్థమవుతోంది అని చెప్పుకొచ్చింది. 
 
బాలీవుడ్‌‌లో అంత పెద్ద సినిమా చేసినా విజయం దక్కకపోవడంపై పూజా స్పందిస్తూ…ఓ హీరోయిన్‌ అరంగేట్రం కోసం ‘మొహంజొదారో’ కంటే పెద్ద సినిమా ఏముంటుంది. అక్కడ భారీ చిత్రంతో పరిచయం అయ్యాను. హృతిక్‌ రోషన్‌ లాంటి స్టార్‌, అషుతోష్‌ గోవారికర్‌ లాంటి దర్శకుడు …ఆ సినిమాకు చేయాల్సినవి అన్నీ చేశాం. అయినా సక్సెస్‌ కాలేదు. కానీ ప్రస్తుతం నాకు హిందీ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అని వివరించింది.