మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శనివారం, 27 మే 2017 (14:23 IST)

ప్రభాస్ పెళ్లి చేసుకునేవరకూ వదిలేట్లు లేరు... వ్యాపారవేత్త మనవరాలితో ప్రభాస్ ఫిక్సట...

బాహుబలి సూపర్ హిట్ కావడం, అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడంతో ఆ చిత్రంలో నటించిన హీరో ప్రభాస్ పెళ్లిపై అనేక రకాలు వార్తలు వస్తున్నాయి. తొలుత ప్రభాస్‌తో జంటగా నటించిన అనుష్కతో వివాహం జరుగుతుందంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై ప్రభాస్ ఖండిస్తూ మాట్లాడటంత

బాహుబలి సూపర్ హిట్ కావడం, అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడంతో ఆ చిత్రంలో నటించిన హీరో ప్రభాస్ పెళ్లిపై అనేక రకాలు వార్తలు వస్తున్నాయి. తొలుత ప్రభాస్‌తో జంటగా నటించిన అనుష్కతో వివాహం జరుగుతుందంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై ప్రభాస్ ఖండిస్తూ మాట్లాడటంతో అవి కాస్తా ఆగిపోయాయి. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది.
 
ప్రభాస్ పెళ్లాడబోయే అమ్మాయి బడా వ్యాపారవేత్త మనవరాలినంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన రాశి సిమెంట్ యజమాని అనీ, ఆయన మనవరాలితో ప్రభాస్ పెళ్లి ఫిక్సంటూ వార్త తిరుగుతోంది. మరి దీనిపై ప్రభాస్ ఏమంటాడో వెయిట్ అండ్ సీ.