సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (20:20 IST)

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

renuka chowdhury
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జంట ముగ్గురేసి పిల్లలను కనాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ సీనియర్ మహిళా, రాజ్యసభ సభ్యురాలు నేత రేణుకా చౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. పిల్లల్ని కంటే ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగం లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. మోహన్ భగవత్ ఎక్కు మంది పిల్లల్ని కనాలని చెబుతున్నారని, కానీ అలా కనేందుకు మహిళలు కుందేళ్ళు కాదన్నారు. 
 
ఈ మాటలు చేప్పేవాళ్ళు ఎంతమంది పిల్లలను పెంచగలరు? అని ఆమె ప్రశ్నించారు. అలా మాట్లాడేవారి అనుభవాలు ఏమిటో బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలో పెరుగుతున్న ధరలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే చికిత్సకయ్యే ఖర్చు భారీగా ఉంటుందని రేణుకా చౌదరి అన్నారు. 
 
కాగా, ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘం చాలక్ మోహన్ భగవత్ ఇటీవల పిలుపునిచ్చారు. దేశంలో జనాభా వృద్ధిరేటు తగ్గుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేయగా వీటిపై రేణుకా చౌదరి మండిపడ్డారు. 
 
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని భావిస్తుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైకాపా రంగులతో పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించిన విషయం తెల్సిందే. దాంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాత రేషన్ కార్డులలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో భాగంగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 
 
ఈ దరఖాస్తులను సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీచేస్తారు. ఇప్పటివాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల ముద్రణ కోసం అవసరమైన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం కేటాయించిన విషయం తెల్సిందే.