శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (11:27 IST)

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. ఆర్ఆర్ఎస్ చీఫ్ ఎమన్నారు?

mohan bhagawat
పొరుగుదేశం బంగ్లాదేశ్‌లోని భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ఆ దేశంలో నివసిస్తున్న భారత హిందూ పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ ఈ దాడులపై ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల సాయం కావాలని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం సాయం చేయడం వారికి చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. బలహీనంగా ఉండటం నేరమవుతుందని మోహన్ భగవత్ అన్నారు. 
 
'మనం బలహీనంగా ఉన్నామంటే నేరాలను ఆహ్వానిస్తున్నట్టే. మనం ఎక్కడ ఉన్నా ఐక్యంగా, సాధికారికంగా ఉండాలి' అని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జరిగిన ఓ దసరా ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆయన స్పందించారు. 
 
మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది. అందుకు కొన్ని తక్షణ కారణాలు ఉండొచ్చు. కానీ, సంబంధించినవారు దీనిపై చర్చించారు. దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ హిందువులపై అఘాయిత్యాలకు పాల్పడటం అక్కడ పునరావృతమవుతోంది. అయితే, తొలిసారి హిందువులు వారి రక్షణ కోసం ఐక్యంగా ఢిల్లీలోకి వచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇదేవిధంగా దాడులు కొనసాగితే హిందువులే కాదు.. అక్కడి మైనారిటీలు అందరూ ప్రమాదంలో పడతారు" అని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు.