శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (11:25 IST)

రాధికా ఆప్టే సూపర్ ఛాన్స్ మిస్సైందట.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ అందాల సుందరి రాధికా ఆప్టే బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో ముందుంటుంది. మహిళలపై జరిగే అరాచకాలపై స్పందించే ఈ ముద్దుగుమ్మ.. మీటూ, క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ దర్శకుడి వద్ద తనకు ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చింది. బరువు పెరిగిన కారణంగా ఓ సినిమా నుంచి తనను తప్పించినట్లు రాధికా ఆప్టే వెల్లడించింది. 
 
సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను పోస్టు చేస్తూ.. సినిమాల్లో రాణిస్తున్న రాధిక ఈ మధ్య ఓ ఛాన్స్ మిస్సైందట. ఇటీవల ఓ మంచి స్క్రిప్ట్ విన్నానని.. కథ, క్యారెక్టర్ తనకు నచ్చింది. దీంతో ఆ సినిమాలో నటించేందుకు సిద్ధంగా వున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా నుంచి తనను తప్పించినట్లు సందేశం వచ్చిందని రాధికా ఆప్టే వెల్లడించింది.
 
దీంతో షాకైన రాధికా ఆ సినిమా నుంచి తప్పించేందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు.. బరువు పెరగడమేనని తేలింది. అంతేగాకుండా బరువు తగ్గేందుకు టైమ్ ఇవ్వండని సదరు దర్శకుడిని రాధికా ఆప్టే అడిగినా ప్రయోజనం లేకపోయిందని.. వారు ఏమాత్రం ఆమెను లెక్కచేయలేదని తెలిసింది.