సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (12:49 IST)

స్కూల్ బ్యాగ్ బరువును తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు రెడీ..

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గిపోయింది. ఒకటి, రెండు తరగతులకు పుస్తకాల బరువును తగ్గించే దిశగా ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత వారమే పాఠశాలలకు సర్క్యులర్ అందిన సంగతి తెలిసిందే. 
 
ఒకటి, రెండు తరగతులకు 1.5 కేజీల బరువు కంటే అధికంగా వుండకూడదని, మూడవ తరగతి నుంచి ఐదు తరగతి వరకు (3 కేజీలు), ఆరవ తరగతి నుంచి-7వ తరగతి వరకు (నాలుగు కేజీలు), 8-9 తరగతులకు (4.5 కేజీలు), పదవ తరగతి విద్యార్థులకు ఐదు కేజీల బరువు వుండాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ పంపిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టింది. 
 
కేంద్రం పంపిన సర్కారు మేరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల బరువును నియంత్రించే విధానాన్ని అమలు పరచనున్నట్లు వెల్లడించింది. విద్యార్థి దశ పుస్తకాల బరువును మితంగా మోస్తే సరిపోతుందని.. బరువున్న బ్యాగులను మోయడం ద్వారా విద్యార్థులకు వెన్ను సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్రం పంపిన సర్క్యులర్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.