శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (22:35 IST)

పుష్పలో స్పెషల్ సాంగ్.. ఊర్వశి రౌటెలాను ఎంపిక చేశారట..!

Urvashi Rautela
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కావడంతో మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగునుంది. ఈ సినిమాని మైత్రీ మూవీమేకర్స్ తెరకేస్తుండగా.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 
 
అయితే మొదటినుంచి సినిమాలో విలన్‌గా తమిళ హీరో విజయ్ సేతుపతి ని అనుకున్నారు కాని డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమాకి దూరమయ్యారు. తర్వాత అరవింద్ స్వామిని పెట్టాలనుకున్న ఆయన కూడా ఈ సినిమా చేయడానికి సముఖంగా లేకపోవడంతో తెలుగు యంగ్ హీరో నారా రోహిత్ అని కూడా వర్తాలు వచ్చాయి. ఇప్పడు తమిళ నటుడు ఆర్య పేరు పుష్ప సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
 
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ సరసన మొదటి హీరోయిన్‌గా రష్మిక నటిసుండగా.. సినిమాలో స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఎంపిక చేశారట. ఈ పాటే సినిమాకు హైలైట్ అవుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.