సమంతలా రకుల్ ప్రీత్ కూడా తెలుగింటి కోడలవుతుందా?

''లౌక్యం'' చిత్రంలో స్విమ్మింగ్ పూల్‌ సీన్ గురించి టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నోరు విప్పింది. ఆ సినిమాలో ఎబ్బెట్టుగా వుండకుండా కెమెరా పెట్టామని.. కొన్నిసార్లు కెమెరా విషయంలో నటించేవారిక

ఆదివారం, 26 నవంబరు 2017 (11:45 IST)
''లౌక్యం'' చిత్రంలో స్విమ్మింగ్ పూల్‌ సీన్ గురించి టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నోరు విప్పింది. ఆ సినిమాలో ఎబ్బెట్టుగా వుండకుండా కెమెరా పెట్టామని.. కొన్నిసార్లు కెమెరా విషయంలో నటించేవారికి అవగాహన లేకపోతే అభాసుపాలు కావాల్సి వస్తుందని రకుల్ చెప్పుకొచ్చింది. పొట్టిదుస్తులు ధరించిన వేళ, కెమెరా యాంగిల్స్ తేడాగా పెడుతున్నారా అనే విషయాన్ని గమనిస్తానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.
 
కొన్ని ఫంక్షన్స్‌లో పొట్టి దుస్తులు వేసుకున్న ఎందరో హీరోయిన్లు ఇబ్బందులు పడిన దాఖలాలున్నాయని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఇక ఫిట్‌నెస్ విషయంలో రాత్రిపూట బాగా తింటానని.. ఆపై పొద్దున్నే ఆ కేలరీలను కరిగించేందుకు వర్కౌట్లు చేస్తుంటానని వెల్లడించింది. 
 
పెళ్లికి తర్వాత భర్తతో ఉత్తరాదిన స్థిరపడేది వుండదని.. తనతో పాటు భర్త కూడా హైదరాబాద్ తీసుకొచ్చుకుంటానని.. ఎవరైనా తెలుగబ్బాయి నచ్చితే తెలుగింటి కోడలిని అవుతానని వెల్లడించింది. అగ్ర హీరోయిన్ నయనతారతో పోల్చుకోనని ఆమె సీనియర్ నటి అని చెప్పింది. ఎన్నో భాషల్లో ఉత్తమ నటిగా నయన నిరూపించుకుందని.. అలాంటి పాత్రలు దక్కలేదని చెప్పింది. 
 
ఇంకేముంది..? తెలుగబ్బాయిని నచ్చితే చేసుకుంటానని రకుల్ చెప్పేయడంతో.. సమంతలా రకుల్ కూడా పెద్దింటి హీరో ప్రేమలో పడి వివాహం చేసుకుని  సెటిలైపోతుందానని ఫిలిమ్ నగర్ జనం అనుకుంటున్నారు.

అన్నీ చూడండి

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య

కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?

జూలై 21, 22 తేదీల్లో వికారాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Donkeys, Frogs: సీమలో వర్షాల్లేవు.. గాడిదలు, కప్పలకు వివాహాలు

Kasturba Hospital: నాలుగేళ్ల కుడి కంటిలో పరాన్నజీవి.. ఎలా కనుగొన్నారంటే?

అన్నీ చూడండి

జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు

సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026

గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?

ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి

ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్

తర్వాతి కథనం
Show comments