మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 29 ఫిబ్రవరి 2020 (21:51 IST)

పవర్ స్టార్ తనయుడుతో రామ్ చరణ్ సినిమా నిజమేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. సినిమాల్లో  రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో సక్సస్ సాధించిన పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సమ్మర్లో మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
 
 ఇలా.. పవన్ రీ-ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా త్వరలోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. అఖిరాకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమట. అందుచేత అఖిరా సినిమాల్లోకి రావాలి అనుకుంటున్నాడట. 
 
రేణుదేశాయ్ మరాఠీలో ఇష్క్ వాలా లవ్ అనే మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా ద్వారా రేణుదేశాయ్, తనయుడు అఖిరాను పరిచయం చేసారు. ఈ సినిమాలో అఖిరా గెస్ట్ రోల్ చేసారు. కొడుకు అఖిరాకు సినిమాల్లోకి రావాలనే ఇంట్రస్ట్ ఉండడంతో యాక్టింగ్‌లో ట్రైనింగ్ ఇప్పించాలనుకుంటున్నాడట పవన్. అఖిరా ఎంట్రీకి సంబంధించి ఇప్పటి నుంచే పవన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలిసింది. అయితే... అఖిరాను హీరోగా పరిచయం చేసే బాధ్యతను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకుంటున్నాడట. 
 
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన అఖిరాతో రామ్ చరణ్‌ ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ అఖిరాను హీరోగా పరిచయం చేయాలని పవన్ పైన ఒత్తిడి పెంచుతున్నారట.
 
అయితే.. ప్రస్తుతం అఖిరా చదువుకుంటున్నాడు. త్వరలో ఓ ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకునేందుకు చేరనున్నాడని... అఖిరా సినిమాల్లో నటించడం అనేది కన్ఫర్మ్. కాకపోతే అది జరగడానికి టైమ్ పడుతుందని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా... పవన్ తనయుడు అఖిరాతో చరణ్ సినిమా తీస్తే.. మెగా ఫ్యాన్స్ కి పండగే.