గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (15:18 IST)

సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న చెర్రీ ''రంగస్థలం"

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". ఇందులో సమంత హీరోయిన్ ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర య

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". ఇందులో సమంత హీరోయిన్ ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 
 
అయితే, ప్ర‌స్తుత పరిస్థితులు అందుకు ఏమాత్రం సహకరించడం లేదు. 'రంగ‌స్థ‌లం' చిత్రీక‌ర‌ణ విష‌యంలో సుక్కూ ఏమాత్రం రాజీకి రావ‌డం లేదు. ప్ర‌తిదీ పక్కాగా తీర్చిదిద్దేందుకు అహోరాత్రులు శ్ర‌మిస్తున్నాడట‌. 
 
అలాగే చ‌ర‌ణ్ కూడా ఇత‌ర‌త్రా వ్యాప‌కాల్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ 151వ సినిమా 'సైరా.. నరసింహా రెడ్డి' బాధ్య‌తలు చ‌ర‌ణ్‌వే కాబ‌ట్టి.. ఆ ప‌నుల్లోనూ బిజీగా తిరుగుతున్నారట. దీంతో సంక్రాంతి రేసు నుంచి చెర్రీ తప్పుకున్నట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఇక బాబాయ్ ప‌వ‌న్ కల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రానికి 'ఆజ్ఞాత‌వాసి' అని పేరు పెట్టినట్టు సమాచారం. ఈ చిత్రం మాత్రం సంక్రాంతికి ఖాయ‌ంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం త‌ర్వాత‌ ఏప్రిల్‌లో మ‌హేష్ 'భ‌ర‌త్ అనే నేను' లైన్‌లో ఉంది.