శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (15:18 IST)

పెరుగును పండ్లతో కలుపుకుని తింటే ఏమౌతుంది?

పెరుగులో వివిధ రకాల పండ్లను కలుపుకుని తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తిన

పెరుగులో వివిధ రకాల పండ్లను కలుపుకుని తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
 
పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. 
 
ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.