శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2017 (13:55 IST)

బ్రేక్ ఫాస్ట్‌లో ఆయిల్ వద్దు.. గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్సే ముద్దు..

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహా

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అన్నీ పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ ఉదయం 5:30- 6:00 గంటల లోపు నిద్రలేవాలి. రోజూ ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. అరగంట పాటు వ్యాయామం చేయండి. అలాగే రెండుమూడు ఉల్లిపాయలు తినండి.
 
ఒకటి లేదా రెండు గ్లాసుల మంచినీరు తాగండి. ఏడెనిమిది గంటల పాటు నీరు లేని శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి. మరో గ్లాసు నిమ్మరసం తాగండి. ఆ తరువాత గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోండి. ఉదయం 8 గంటల్లోపు బ్రేక్ ఫాస్ట్‌ని ముగించే ప్రయత్నించాలి. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ లేకుండా, కుదిరితే, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ లేదంటే ఇంట్లో దొరికే ఇడ్లీ ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా చాలామంది ఫాస్ట్‌పుడ్, జంక్‌ఫుడ్‌ల వైపు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం చాలామంది బర్గర్లు, పిజ్జాలు తినడానికే ఇష్టపడుతున్నారు. బర్గర్‌, పిజ్జా, రెడ్ మీట్‌లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బరువులో అనూహ్యమైన మార్పులు వ‌స్తాయ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.